ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లఘుచిత్రంతో.. కరోనా వ్యాక్సినేషన్​పై అవగాహన

ప్రజలకు విస్తృత స్థాయి అవగాహన కల్పించేందుకు ప్రచార చిత్రాలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు. తెనాలిలోని పెద్దరావూరు ఫిలిం స్టూడియోలో కరోనా వ్యాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కోసం రూపొందింస్తున్న ప్రచార లఘు చిత్రం షూటింగ్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

క్లాప్ కొడుతున్న కలెక్టర్ ఐ.శ్యాముల్
క్లాప్ కొడుతున్న కలెక్టర్ ఐ.శ్యాముల్

By

Published : Jan 20, 2021, 8:37 AM IST

Updated : Jan 20, 2021, 2:59 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలో కరోనా వ్యాక్సినేషన్ పై రూపొందిస్తున్న ప్రచార లఘు చిత్రం షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ హాజరయ్యారు. సినీ నటులు శుభలేఖ సుధాకర్, శ్రీలత పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ఆయన క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశ చిత్రీకరణకు తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కరోనా వ్యాక్సినేషన్ పై ప్రజలలో ఉన్న అపోహలు, సందేహాలను తొలగించేందుకు, వారికి పూర్తి అవగాహన కల్పించేందుకు రెండు, మూడు నిమిషాల నిడివితో లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం సంవత్సరం పాటు కొనసాగుతుందని.. ప్రాధాన్యత క్రమంలో దశల వారిగా ప్రతి ఒక్కరికి కోవిడ్-19 వ్యాక్సిన్ టీకా అందుతుందని తెలిపారు.

సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని కరోనా అల్లకల్లోలం చేసిందని.. ఆ వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడ్డారని వ్యాక్సినేషన్ రావటం సంతోషకరమని అన్నారు. ఇప్పటివరకు ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో, వ్యాక్సినేషన్ తీసుకున్న తరువాత కూడా కొంత కాలం పాటు అవే జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఇటువంటి ప్రచార చిత్రాలు చేస్తున్నామన్నారు.

Last Updated : Jan 20, 2021, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details