ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేటలో కూలిన రెస్టారెంట్​ పైకప్పు.. ఒకరికి గాయాలు - చిలకలూరిపేట

చిలకలూరిపేటలో రెస్టారెంట్ పైకప్పు కూలి...ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కొంత మెుత్తంలో ఆస్తి నష్టం వాటిల్లింది.

చిలకలూరిపేటలో రెస్టారెంట్ పై కప్పు కూలి..ఒకరికి గాయం

By

Published : Apr 1, 2019, 5:38 PM IST

చిలకలూరిపేటలో కూలిన రెస్టారెంట్ పై కప్పు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం నరసరావుపేట సెంటర్లో సూర్య రెస్టారెంట్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.రెస్టారెంట్ పక్కనే తోట సత్యనారాయణ ఖాళీ స్థలం ఉండడంతో... అందులో ఇటీవల భవన నిర్మాణం చేపట్టారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా,.. అనుమతులు లేకుండా ఎక్కువ లోతు తీయడంతో పక్కనే ఉన్న రెస్టారెంట్ పైకప్పు హఠాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో 20 మంది వరకు భోజనం చేస్తున్నారు. ప్రమాద సంఘటనతో భయభ్రాంతులైన వారంతా పరుగులు తీశారు. కౌంటర్లో ఉన్న రెస్టారెంట్ యజమాని దాసరి ప్రేమ్ చందుకు గాయాలయ్యాయి. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి చూడండి...

ABOUT THE AUTHOR

...view details