ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RARE SURGERY: ఏడేళ్ల చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స.. యథాతథ స్థితిలోకి శరీర భాగాలు - Guntur District villages news

rare treatment at Aditya Multi Super Specialty Hospital: ప్రమాదవశాత్తు ఓ ఏడేళ్ల చిన్నారి పాల వాహనం నుంచి కిందకు జారిపడి ముఖ కండరాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. దీంతో ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకురాగా.. హుటాహుటిన పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు శ్రమించి అరుదైన శస్త్ర చికిత్స చేశారు.

rare treatment
rare treatment

By

Published : May 6, 2023, 12:01 PM IST

rare treatment at Aditya Multi Super Specialty Hospital: గుంటూరు జిల్లాలో ఉన్న ఆదిత్య మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు ఓ ఏడేళ్ల చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స చేశారు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో చిన్నారి ముఖ కండరాలు నుజ్జు నుజ్జు కాగా.. దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు శ్రమించి.. మరలా చిన్నారి ముఖాన్ని యథాతథ స్థితిలోకి తీసుకొచ్చారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో పాప మొహంలో మళ్లీ సంతోషాన్ని చూడటం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆసుపత్రి ఎండీ డాక్టర్. కృష్ణ స్రవంత్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. శస్త్ర చికిత్సలో శ్రమించిన వైద్యులను అభినందించారు. అనంతరం ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కూతురి ప్రాణాలను రక్షించిన వైద్య బృందానికి బాధితురాలి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మరి ఏంటి ఆ శస్త్ర చికిత్స..?, ఆ చిన్నారికి జరిగిన ప్రమాదం ఏంటి..? అనే వివరాల్లోకి వెళ్తే..

చిన్నారి ముఖ కండరాలు నుజ్జు నుజ్జు..పల్నాడు జిల్లా కారంపూడి మండలానికి చెందిన జ్ఞాన లక్ష్మి అనే ఏడేళ్ల చిన్నారి పాల వ్యాన్ నుంచి కిందకు జారిపడి ప్రమాదవశాత్తు ముఖ కండరాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. దీంతో తల్లిదండ్రులు గాయపడిన చిన్నారిని గుంటూరు జిల్లాలోని ఆదిత్య మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. చిన్నారి పరిస్థితిని గమనించిన ఆసుపత్రి వైద్య బృందం.. హుటాహుటిన అత్యవసర పరీక్షలు చేశారు.

ఎనిమిదిన్నర గంటలపాటు శస్త్ర చికిత్స..ఈ క్రమంలో చిన్నారి ప్రాణాలను కాపాడి, ప్రమాదంలో చితికిపోయిన ముఖానికి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్‌లో భాగంగా వైద్య బృందం.. సుమారు 8:30 గంటల పాటు శ్రమించి, చితికిపోయిన చిన్నారి ముఖాన్ని, కుడి కంటి భాగాన్ని మరలా యథాతథ స్థితిలోకి తీసుకురావటం కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఎండీ. డాక్టర్. కృష్ణ స్రవంత్ మీడియాతో మాట్లాడుతూ..'' ఆసుపత్రిలో తాజాగా అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. మా వైద్య బృందం సుమారు 8:30 గంటల పాటు శ్రమించి, ప్రమాదంలో చితికిపోయిన ఏడేళ్ల చిన్నారి ముఖాన్ని, కుడి కంటి భాగాన్ని మరలా యథాతథ స్థితిలోకి తీసుకురావటం కోసం ఎంతో శ్రమించారు. అందుకు వారందరికీ (డా.పి కృష్ణ శ్రావంత్, డా. అమూల్య, డా. శిరీష్ సంపర) అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ శస్త్ర చికిత్స విజయవంతం అవ్వడంతో పాప మొహంలో సంతోషాన్ని చూడగల్గుతున్నాం.'' అని ఆయన అన్నారు.

వైద్య బృందానికి ధన్యవాదాలు.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారికి గుంటూరులోని ఆదిత్య మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి, ప్రాణాలను కాపాడడంతో.. చిన్నారి తల్లిదండ్రులు, బంధుమిత్రులు వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తమ కుమార్తె ప్రాణాలతో పాటు, దెబ్బతిన్న చిన్నారి శరీర భాగాలను యథాతథ స్థితిలోకి తెచ్చిన వైద్యుల పట్ల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details