గుంటూరు జిల్లా(guntur district) పెదకాకాని మండలానికి చెందిన ఓ మహిళ తన భర్తతో విబేధాలు రావడంతో కుమార్తెతో కలిసి నివసిస్తోంది. పదేళ్ల క్రితం రాయపూడి(rayapudi)కి చెందిన జోజిబాబు(jojibabu) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆరో తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పింది. ఈ ఘటనపై బాలిక తల్లి జోజిబాబుపై పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు(complaint) చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... వైద్య పరీక్షల కోసం బాధితురాలిని గుంటూరు జీజీహెచ్(guntur GGH)కు తరలించారు.
rape on girl : బాలికపై అత్యాచారం... కేసు నమోదు
గుంటూరు జిల్లా పెదకాకాని(pedakakani)లో దారుణం జరిగింది. వరసకు తండ్రి అయ్యే వ్యక్తి... 12 ఏళ్ల చిన్నారి(girl)పై అత్యాచారా(rape)నికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాలికపై అత్యాచారం