ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాపట్లలో దారుణం.. బాలికపై అత్యాచారయత్నం - మైనర్ బాలికపై అత్యాచారయత్నం

గుంటూరు జిల్లా బాపట్లలో... బాలిక ఒంటరిగా ఉన్న సమయం చూసిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. చివరికి ఊచలు లెక్కపెడుతున్నాడు.

Rape attempt on a minor girl
మైనర్ బాలికపై అత్యాచారయత్నం

By

Published : Jan 4, 2020, 3:21 PM IST

మైనర్ బాలికపై అత్యాచారయత్నం

గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో దారుణం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పన్నెండేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. ఆ బాలిక తాతయ్య, అమ్మమ్మ వద్ద ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇంటికి సమీపంలోని పెద్దమ్మ కాలనీలో నివాసముండే కట్టా విజయ్ కుమార్.. ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి.. మద్యం తాగి వెళ్లాడు. అత్యాచారయత్నం చేయగా.. ఆమె బిగ్గరగా అరిచింది. ఇంతలోనే పని నుంచి వచ్చిన తాతయ్య గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం బాపట్ల ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details