రైతన్న ఎన్నో వ్యయ ప్రయాసలు పడి పంటను చేతికి దక్కించుకున్నాక... ధాన్యాన్ని ఎలుకలు నాశనం చేస్తాయి. ఈ సమస్య పరిష్కర కోసం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తాళ్లూరులో వరి పంటలో సామూహిక ఎలుకల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వరి పంటలో ఎలుకల బెడద నివారణకు మందే పరిష్కారం
వరినాట్లు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరుకు రైతు ఆందోళన చెందుతునే ఉంటాడు. అధికశాతం ఎలుకల వల్లే రైతన్న నష్టపోతున్నాడు. ఇందుకు పరిష్కర దిశగా ఎలుకల బెడదను నివారించేందుకు ప్రభుత్వం మందును ఉచితంగా పంపిణీ చేస్తోంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని జేడీఎ ప్రారంభించారు.
వరి పంటలో ఎలుకల బెడద నివారణకు మందే పరిష్కారం
జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ విజయభారతి రైతులకు అవగాహన కల్పించారు. ఎలుకలతో ఒక ఎకరంలో 3 నుంచి 5 బస్తాల వరకు నష్టం కలుగుతుందన్నారు. ఎలుకల మందును రైతు భరోసా కేంద్రాలు ద్వారా ఉచితంగా అందించారు. అవి ఉండే బొరియల వద్ద ఈ మందును ఉంచాలని సూచించారు.
ఇవీ చదవండి: