ప్రైవేట్ భూముల్లో ఆక్రమణల పర్వం.. గుంటూరులో కలకలం - శివారు ప్రాంతాల్లోని ప్రైవేట్ భూముల ఆక్రమణల పర్వం
భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నందున పర్యవేక్షణ లేని ప్రైవేట్ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది.
గుంటూరు శివారు ప్రాంతాల్లో ప్రైవేటు భూముల్లో ఆక్రమణలు పెచ్చుమీరుతున్నాయి. భూముల ధరలకు రెక్కలు వస్తున్న కారణంగా.. కొందరు కుల సంఘాల పేరుతో ప్రభుత్వ స్థలమంటూ ప్రైవేటు భూముల్లో పాగా వేస్తున్నారు. తాజాగా.. గుంటూరు శివారు అడవి తక్కెళ్లపాడు వద్ద 15 ఎకరాల భూమిలో కొందరు పేదలు షెడ్లు వేసుకునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భూ యజమానులు రెవిన్యూ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించారు. అధికారులు తక్షణమే ఈ ఆక్రమణలను అడ్డుకోవాలని తమకు న్యాయం చేయాలని భూ యజమానులు కోరుతున్నారు. ఫిర్యాదుపై పోలీసు, రెవిన్యూ అధికారులు విచారణ చేపట్టారు.