'విద్యుత్ విలువైంది..వృధా చేయకూడదు' అంటూ గుంటూరు జిల్లాలో ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఇంధన పొదువు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ హాజరయ్యారు. ఇంధనం పొదుపుగా వినియోగించుకోవాలంటూఅధికారులు, విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం నుంచి వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గుంటూరులో ఇంధన పొదుపు వారోత్సవాలు - గుంటూరులో ఇంధన పొదుపు వారోత్సవాలు
గుంటూరు జిల్లావ్యాప్తంగా ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. 'విద్యుత్ విలువైంది.. వృధా చేయకూడదు' అంటూ ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ పిలుపునిచ్చారు.
![గుంటూరులో ఇంధన పొదుపు వారోత్సవాలు power saving rally in Guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5387432-75-5387432-1576479322856.jpg)
గుంటూరు జిల్లాలో ఇంధన పొదుపు వారోత్సవాలు
గుంటూరు జిల్లాలో ఇంధన పొదుపు వారోత్సవాలు