గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొండుబొట్ల వారి పాలెంలో స్థల వివాదంలో చంద్రశేఖర్ అనే వ్యక్తిని పోలీసు స్టేషన్ కు పిలిపించారు. జూన్ 6వ తేదీన కేసు నమోదు చేశారు. శనివారం విచారణకు పిలిపించగా ఎస్సై ఎదుటే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు వెంటనే బాపట్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం పొన్నూరులో ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
పోలీస్ స్టేషన్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
బాపట్ల గ్రామీణ పోలీస్ స్టేషన్లో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఆత్మహత్యాయత్నం