ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

విశాఖ నుంచి నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న 1000 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు గుంటూరులోని మంగళగిరి పోలీసులు తెలిపారు. ఉన్నతాధికారుల ద్వారా మంగళగిరి గ్రామీణ పోలీసులకు అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి.. గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

marijuana seized
marijuana seized

By

Published : Jun 28, 2021, 7:08 PM IST

పోలీసులు ఎన్ని రకాలుగా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నా అక్రమార్కులు తమ పని చేసుకుంటూ పోతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి, మద్యం, గుట్కాలు తరలిస్తున్నారు. పోలీసులు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా ప్రతీ సారి ఏదో ఒక రకంగా తరలిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు.

కొంత మంది వ్యక్తులు విశాఖ నుంచి నెల్లూరుకి అక్రమంగా 1000కిలోల గంజాయిని తరలిస్తున్నారు. ఈ విషయం తెలిసిన గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. నిందితులు ఎవరికీ అనుమాన రాకుండా మినీ లారీలో పైనాపిల్​ లోడ్​ నింపారు. లోపల మాత్రం గంజాయిని లోడ్​ చేశారు. మంగళగిరి గ్రామీణ పోలీసులకు అందిన సమాచారం మేరకు కాజా టోల్ గేట్ వద్ద నిన్న రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పైనాపిల్​ లోడుతో వెళ్తున్న మినీ లారీలో ఒక టన్ను గంజాయిని గుర్తించారు. వాహనాన్ని సీజ్​ చేసి పోలీస్​స్టేషన్​కి తరలించామని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇదీ చదవండి:Flash: వ్యవసాయ బావిలో పడి బాలిక, ఇద్దరు యువకులు మృతి

ABOUT THE AUTHOR

...view details