ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో యథేచ్ఛగా అక్రమ మద్యం సరఫరా - గుంటూరు అర్బన్

మద్యం అక్రమ రవాణా కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మద్యం ప్రియులు అనేక పక్కదారులు పడుతున్నారు. గుంటూరులోని వివిధ ప్రాంతాలలో చేపట్టిన తనిఖీల్లో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

guntur district
జిల్లాలో అక్రమ మద్యం తరలింపు కేసులు

By

Published : Jun 6, 2020, 12:04 PM IST

గుంటూరు జిల్లాలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై పోలీసులు నిఘ పెట్టారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు చేస్తున్నారు. తాజాగా గుంటూరు అర్బన్ ప్రాంతంలో తాడికొండ అడ్డరోడ్డు వద్ద 40 క్వార్టర్​ బాటిళ్లు, మంగళగిరి పట్టణంలో 22 మద్యం బాటిళ్లు, మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో 13 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని.. కేసులు నమోదు చేశారు.

గుంటూరు రూరల్ ప్రాంతంలో గురజాల, నరసరావుపేట, తెనాలి, బాపట్ల, సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 16 కేసులు (రెంటచింతల-2, దాచేపల్లి-6, కారంపూడి-1, తెనాలి త్రీటౌన్-1, పిడుగురాళ్ల-2, మాచవరం-2) నమోదు కాగా వారి వద్ద నుంచి 658 మద్యం సీసాలు, 11 వాహనాలు స్వాధీనం చేసుకుని 25 మందిని అరెస్ట్ చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

ఇది చదవండి19 నుంచి బడ్జెట్ సమావేశాలు?

ABOUT THE AUTHOR

...view details