ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో దిక్కులేని అగ్నిమాపక కేంద్రాలు - కాలిపోతున్నా కళ్లు తెరవని జగన్‌ సర్కార్‌ - Shortage of fire stations in AP

People Problems Due to Lack of Fire Stations in AP: రాష్ట్రంలో అగ్నిమాపక కేంద్రాలు లేక ఏదైనా ప్రమాదం జరిగి పంటలు నాశనం అవుతున్నా, ప్రజల ప్రాణాలు పోతున్నా వైసీపీ ప్రభుత్వానికి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుంది. ఎక్కడైనా అగ్నిప్రమాదాలు జరిగితే పొరుగు రాష్ట్రాల ఫైరింజన్ల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి జగన్ ప్రభుత్వంలో వచ్చింది.

-fire_stations
-fire_stations

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2024, 12:40 PM IST

People Problems Due to Lack of Fire Stations in AP:అగ్ని ప్రమాదాల్లో పంటలు, ఇళ్లు ఆహుతవుతున్నా జగన్‌ సర్కార్‌ కళ్లుతెరవడం లేదు. అనేక నియోజక వర్గాల్లో అగ్నిమాపక కేంద్రాలు లేక ప్రజలకు తీరని నష్టం జరుగుతున్నా కన్నెత్తి చూడటం లేదు. ఒకప్పుడు పొరుగురాష్ట్రాలకు అత్యవసర సహాయక బృందాలు పంపించే స్థాయి నుంచి సమీప రాష్ట్రాల అగ్నిమాపక శకటాలపై ఆధారపడే దుస్థితి ఏపీలో నెలకొంది. ఏజెన్సీ పల్లెలు, మారుమూల గ్రామాల్లో అయితే అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకునే సరికి బాధితులకు బూడిదే మిగులుతోంది.

ప్రజలపై చెత్త పన్ను వేసేయ్‌ - చెల్లించకపోతే సంక్షేమ పథకాలు తీసెయ్ - జగన్ తీరుపై వైఎస్సార్​సీపీ నేతల విమర్శలు

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇది చెప్పుకునేందుకు గొప్పగా ఉన్నా ఈ నియోజకవర్గంలోని పాలసముద్రం మండలం పరిధిలో అగ్నిప్రమాద కేంద్రమే లేదు. ఫలితంగా ఏదైనా అగ్ని ప్రమాదం ప్రమాదం జరిగితే తమిళనాడులోని ప్రొద్దుటూరుపేట, పల్లిపట్టు కేంద్రాల నుంచి అగ్నిమాపక శకటాలు రావాల్సిందే. పాలసముద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఏపీలోని పుత్తూరు అగ్నిమాపక కేంద్రం ఉంది. ఇక్కడి నుంచి శకటాలు బయల్దేరి ఘటనా స్థలానికి చేరుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీంతో అగ్నిమాపక సేవల కోసం తమిళనాడునే నమ్ముకోవాల్సిన దుస్థితి.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోనూ అంతే. అగ్నిప్రమాదం జరిగితే పక్కనే ఉన్న ఒడిశాలోని పర్లాఖెముండిలోని అగ్నిమాపక శకటాలే దిక్కు. పాతపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలోని టెక్కలి, 40 కిలోమీటర్ల దూరంలోని నరసన్నపేట, 30 కిలోమీటర్ల దూరంలోని కొత్తూరుల్లో అగ్నిమాపక కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల నుంచి అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకునేలోగా బూడిదే మిగులుతోంది.

ఎస్సీ, ఎస్టీలపై జగన్ స్వీట్ మాటలు - పథకాలు కట్- ఉపాధిని దూరం చేసి కట్టు బానిసలుగా మార్చాలనే కుట్ర!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో పరిస్థితి మరింత దయనీయం. ఇక్కడి మన్యంలో మంటలు చెలరేగితే మసైపోవాల్సిందే. కొన్ని ప్రాంతాల్లో ప్రమాదం సంభవిస్తే 140 కిలోమీటర్ల దూరం నుంచి ఫైరింజనులు పంపాల్సిరావడం సమస్య తీవ్రతకు నిదర్శనం. అల్లూరి జిల్లాలోని సీలేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, అరకు తదితర ప్రాంతాల్లో ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా పాడేరు నుంచే అగ్నిమాపక శకటాలు వెళ్లాలి. పాడేరు నుంచి సీలేరుకు 140 కిలోమీటర్లు, పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి తదితర ప్రాంతాలకు 90 కిలోమీటర్ల దూరం. దీంతో ఈ ప్రాంతంలో మంటలు చెలరేగితే స్థానికులే ఏవో తిప్పలు పడి వాటిని ఆర్పుకోవాల్సిందే తప్ప ఫైరింజన్‌లు సకాలంలో ఆ ప్రాంతం ముఖమే చూసే పరిస్థితి లేదు.

ఇవి మాత్రమే కాదు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేదు. అనంతపురం జిల్లాలోని శింగనమల, రాప్తాడు, నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గాల పరిధిలో ఫైర్‌ స్టేషన్ల ఏర్పాటును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, గోపాలపురం, రాజమహేంద్రవరం గ్రామీణం, కాకినాడ జిల్లాలోని కాకినాడ గ్రామీణం, విశాఖపట్నం తూర్పు తదితర నియోజకవర్గాల పరిధిలో అగ్నిమాపక కేంద్రాలు లేక తీరని నష్టం జరుగుతోంది.

Jagan Govt cut the Welfare Schemes for Contract Workers: చిరుద్యోగులపై దొంగదెబ్బ.. జీతాలు పెంచి పథకాలు కట్ చేసిన జగన్ సర్కార్

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, బాపట్ల జిల్లా పర్చూరు, వేమూరు తదితర నియోజకవర్గాల పరిధిలోనూ ఇదే పరిస్థితి. అగ్నిమాపక కేంద్రాలు లేక ప్రమాదాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా జగన్‌కు పట్టడం లేదు. ఏటా వేలాది మంది అగ్నిప్రమాద బాధితులుగా మారుతుంటే, కోట్ల విలువైన ఆస్తులు నష్టపోతుంటే వారి వేదన తీర్చే ప్రయత్నం చేయడం లేదు. పొరుగు రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు సంభవిస్తే సహాయక బృందాలను పంపించే స్థాయి ఒకప్పటి ఆంధ్రప్రదేశ్‌ది. మన దగ్గర అగ్నిప్రమాదాలు జరిగితే పొరుగు రాష్ట్రాల ఫైరింజన్ల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఇప్పటిది.

ABOUT THE AUTHOR

...view details