Chief Minister Jagan's visit to the capital: ముఖ్యమంత్రి జగన్ ఈ నెల24న రాజధానిలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం తొమ్మిదన్నర గంటలకు మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో పేదలకు ఇచ్చిన సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. అనంతరం ఇళ్ల నిర్మాణం సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. రాజధాని ప్రాంతంలో పేదల కోసం కేటాయించిన 25 లేఔట్లలో మౌలిక వసతులలో భాగంగా సీఆర్డీయే ఆధ్వర్యంలో 11 పాఠశాలలు, 12 ఆరోగ్య కేంద్రాలు, 11 అంగన్ వాడీ కేంద్రాలు, 11 డిజిటల్ గ్రంథాలయాల నిర్మాణాలను ప్రారంభించే శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. రూ.146కోట్లతో 28వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత సెంటు స్థలాల్లో నిర్మించిన నమూనా ఇంటిని పరిశీలిస్తారు. అక్కడే లబ్ధిదారులతో కాసేపు ముచ్చటిస్తారు. అనంతరం వెంకటపాలెం సభకు వెళ్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి సురేష్, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. సోమవారం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టనున్నారని మంత్రి సురేష్ చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ పరిశీలించారు.
CM Jagan tour: రాజధాని సెంటు స్థలాల్లో భూమి పూజకు ఏర్పాట్లు పూర్తి..! సీఎం పర్యటనకు భారీ భద్రత!
Chief Minister Jagan's visit to the capital: మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ముఖ్యమంత్రి జగన్ ఈ నెల24న సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం అని మంత్రి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు ఎలా వచ్చినా ఇళ్ల నిర్మాణాలకు అడ్డంకి ఉండదని చెప్పారు.
రాజధానిలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో నిర్మాణాలు పూర్తి చేసి తీరుతామని.. దీనిపై రైతులు సుప్రీం కోర్టుకు వెళ్తే తాము కూడా వెళ్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. హైకోర్టు తీర్పు ఎలా వచ్చినా నిర్మాణాలకు అడ్డంకి ఉండదనిధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి సురేష్, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. కృష్ణాయపాలెం లేఔట్ లో నిర్మించిన ఇంటి నమూనాను పరిశీలించారు. రాబోయే 5,6 నెలల్లో 50వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.
రాజధానిలో పేదలకు ఇచ్చిన సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ సోమవారం భూమి పూజ చేయనున్నారు. ఈ సందర్భంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వేసిన ఫ్లెక్సీలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు. గతంలో విద్యా శాఖ మంత్రిగా పని చేసిన ఆయన.. ఇప్పుడు అనేక విద్యా సంస్థలకు అధిపతి అయిన మంత్రి ఫ్లెక్సీలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అక్షరదోషాలు దొర్లాయి. పేదలను పేద్దోళ్లుగా చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయం చార్రితాత్మకం అంటూ కృష్ణాయపాలెం వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పేద్దోళ్లు, చార్రితాత్మకం అని రాయడంపై ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలుగు భాషను విస్మరిస్తే ఇలాంటి తప్పులే వస్తాయని ప్రజలు చెబుతున్నారు.