ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ ఆలోచన మారాలని ప్రార్థించా: నారా లోకేశ్ - గుంటూరు సెయింట్ మ్యాథీవ్స్ చర్చిలో నారా లోకేష్ ప్రార్థనలు...!

క్రిస్మస్ సందర్భంగా పేదవారికి తోచినంత సాయం చెయ్యాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. గుంటూరు సెయింట్ మ్యాథీవ్స్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. రాజధాని విషయంలో సీఎం జగన్ ఆలోచన మారాలని... ప్రార్థించినట్లు తెలిపారు.

Naralokesh_Christmas_Clebration
గుంటూరు సెయింట్ మ్యాథీవ్స్ చర్చిలో నారా లోకేష్ ప్రార్థనలు

By

Published : Dec 25, 2019, 12:42 PM IST

సీఎం జగన్ ఆలోచన మారాలని ప్రార్థించా: నారా లోకేశ్
క్రీస్తు సందేశమే ప్రపంచ శాంతికి మార్గమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా... గుంటూరులోని సెయింట్ మ్యాథీవ్స్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపించిన మార్గంలో అందరూ నడవాలని సూచించారు. కుటుంబంతో పాటు సమాజం అంతా సంతోషంగా ఉండటం కోసం ప్రార్థన చెయ్యాలని చెప్పారు.

కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే శక్తిని ఏసు మనకిచ్చారని... ఈ క్రిస్మస్ సందర్భంగా పేదవారికి తోచిన విధంగా సాయం చెయ్యాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు అందరూ ఆనందంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. రాజధాని విషయంలో సీఎం జగన్ ఆలోచన మారాలని... అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రార్థించినట్లు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details