Nara Lokesh Fires on CM Jagan: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సీఎం జగన్ అణిచివేత వైఖరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. జనం రోడ్డెక్కితే సీఎం జగన్ జడుసుకుంటున్నాడని, నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నాడంటూ విమర్శించారు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అరెస్టుపై, తమ హక్కుల కోసం పోరాడుతున్న వివిధ వర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్ పిరికితనాన్ని చాటిచెపుతోంది అని లోకేశ్ అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేపట్టిన అంగన్వాడీలపై నిన్న పోలీసుల నిర్బంధం తీరు నిర్ఘాంతపరిచిందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన ఆ మహిళలపై అంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటో అర్ధం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో నిరసనలు, వ్యతిరేక గళాలు ఉంటాయన్న విషయం జగన్ తెలుసుకోవాల్సి ఉందని హితవు పలికారు. అలాగే చంద్రబాబు అక్రమ అరెస్టుపై రాష్ట్రంలో నిరసనలకు దిగిన మహిళలు, నేతలపై పోలీసుల దమనకాండను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. అతి త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి పాడెకడతారు అంటూ లోకేశ్ హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.
TDP Leader Lokesh Fire on YCP Govt: 'సముద్ర గర్భంలో, అంతరిక్షంలో కూడా 144 సెక్షన్ అమలుచేసేలా.. వైసీపీ తీరు ఉంది': లోకేశ్
Nannapaneni Rajakumari on Chandrababu Naidu Arrest: తెలుగుదేశం అధినేత చంద్రబాబుని జైలుకు పంపి ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలా అని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు భయపడుతున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించారు.
హుందాతనంతో, పరిణతితో వ్యవహరించిన భువనేశ్వరి వ్యాఖ్యలపై ప్రతి మహిళా ఆలోచన చేయాలని కోరారు. భువనేశ్వని మాటలను చూసి.. ప్రతి మహిళకు ధైర్యం వచ్చిందని అన్నారు. ఇంగిత జ్ఞానం ఉన్నవారెవరూ మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోరంటూ మండిపడ్డారు. వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు.. ముఖ్యమంత్రి భజన చేయడం కాకుండా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలని నన్నపనేని రాజకుమారి హితవు పలికారు. అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు.
Nannapaneni Rajakumari Tears Over Chandrababu Arrest: చంద్రబాబుపై కక్షపూరితంగా కేసు పెట్టారు.. కన్నీటి పర్యంతమైన నన్నపనేని రాజకుమారి
ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారి ఖ్యాతిని పెంచారని అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉండటానికి కారణం ఈ ప్రభుత్వ కక్ష సాధింపు దోరణే అని విమర్శించారు.
నారా లోకేశ్, చంద్రబాబుకు ప్రజల చూపిస్తున్న అభిమానం చూడలేకనే ఇలా చేశారని అన్నారు. మహిళలంతా హారతులతో స్వాగతం పలుకుతూ ఉంటే దానిని ఓర్వలేక.. ఎలా అయినా ఆపాలని వైసీపీ ప్రభుత్వం తెలివితక్కువ పని చేసిందని మండిపడ్డారు. చంద్రబాబును అమానుషంగా అరెస్టు చేశారని.. వైసీపీ ప్రభుత్వం చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు అరెస్టును ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారని.. యువత, మహిళలు అంతానిరసనలు చేస్తున్నారన్నారు.
వైసీపీ పార్టీ నేతలు సైతం చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తున్నారని.. జగన్ తీరుతో ప్రతి ఒక్కరూ విసుగుచెందారని అన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏం చేశారో చిన్న పిల్లాడికి సైతం తెలుసని వ్యాఖ్యానించారు. ప్రజలంతా చంద్రబాబును సీఎంగా చూడటానికి వేచిచూస్తున్నారని తెలిపారు.
Nara Bhuvaneshwari Questioned YSRCP Government : చంద్రబాబు ఏం తప్పు చేశారని అరెస్టు చేశారు.. ఆయన ప్రజల మనిషి : భువనేశ్వరి