రాష్ట్రంలో కరోనాని గాలికొదిలేసి వైకాపా రెండేళ్ల పాలనంటూ ఉత్సవాలు చేసుకోవటానికి సిగ్గు లేదా అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం మారెళ్లవారి పాలెం గ్రామంలో వైకాపా నేతల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్తలు వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, మహేష్‌లను.. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నక్కా ఆనంద్ బాబు, జీవీ ఆంజనేయులు పరామర్శించారు. కరోనా నిబంధనలను గాలికొదిలేసి.. వైకాపా నేతలు రెండేళ్ల పాలనంటూ డీజేలు, బాణసంచా పేలుస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించారని ఆరోపించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎస్సై రవీందర్ రెడ్డికి గ్రామస్థులు ఫిర్యాదు చేసిన.. అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు. ఇటువంటి అరాచకాలను తెదేపా వదిలిపెట్టదని.. తప్పు చేసిన వారు అధికారులైనా, నాయకులైన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
'కరోనాని గాలికోదిలేసి.. రెండేళ్ల పాలనంటూ ఉత్సవాలేంటి?' - guntur district updates
కరోనాని గాలికోదిలేసి వైకాపా రెండేళ్ల పాలనంటూ ఉత్సవాలు చేసుకోవాటాన్ని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తప్పుపట్టారు. ఉత్సవాల్లో భాగంగా మారెళ్లవారి పాలెంలో తెదేపా నేతలపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. దాడిలో గాయపడిన వారిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నక్కా ఆనంద్‌బాబు, జీవీ ఆంజనేయులు పరామర్శించారు.
నక్కా ఆనంద్ బాబు