విజయవాడలో బీటెక్ యువతిని చంపి.. కత్తితో గాయపర్చుకున్న నిందితుడు నాగేంద్రబాబు కోలుకున్నాడు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి నిందితుని వివరాలు తెలిపారు. ఈనెల 15న కత్తిపోట్లతో ఆసుపత్రిలో చేరిన నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అతను కొలుకుంటున్నాడని ఆమె అన్నారు. నాగేంద్రబాబుని వైద్యులు పూర్తిగా పరీక్షించిన అనంతరం అతనిని డిశ్ఛార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే ఎప్పుడు డిశ్ఛార్జ్ చేస్తామన్నది చెప్పేలేమన్నారు.
గుంటూరు జీజీహెచ్‌లో కోలుకున్న నిందితుడు నాగేంద్రబాబు - గుంటూరు జీజీహెచ్‌లో నిందితుడు నాగేంద్రబాబు తాజా వార్తలు
విజయవాడలో యువతిని చంపి.. గాయపర్చుకున్న నాగేంద్రబాబు గుంటూరు జీజీహెచ్‌లో కోలుకున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి వెల్లడించారు.
గుంటూరు జీజీహెచ్‌లో కోలుకున్న నిందితుడు నాగేంద్రబాబు
ఈ నెల 15న విజయవాడలో బీటెక్ యువతిని నాగేంద్రబాబు కత్తితో పొడిచి హతమార్చి అనంతరం తాను కత్తితో పొడుచుకుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగేంద్రబాబు పూర్తిగా కొలుకుంటే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పోలీసులు. విచారణ అనంతరం ఈ కేసుకి సంబంధించిన అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
గుంటూరు: నాగేంద్రబాబు డిశ్చార్జిపై వైద్యులు, పోలీసుల తర్జనభర్జనలు
Last Updated : Oct 26, 2020, 5:43 PM IST