గుంటూరు జిల్లా తెనాలి మండలం.. కొలకలూరు గ్రామంలో ఈ నెల 14వ తేదీన సాయంత్రం 5.30 నిమిషాలకు తిరుమలశెట్టి నాగరాజు అనే వ్యక్తి హత్యకు గురైనట్లు తెనాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు..శుక్రవారం హత్యకు కారణమైన రాము మహేష్ ను తెనాలి మండలం ఆటో నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రామ్ మహేష్ ఐదోవ తరగతి వరకు చదివి మధ్యలో ఆపేసి.. ప్లంబర్, లారీ క్లీనర్‌గా పనులు చేసుకుంటున్నాడు.
'కుటుంబ కలహాలతోనే సోదరుడిని హత్య చేశాడు' - గుంటూరు జిల్లా క్రైమ్ వార్తలు
ఈనెల 14 న జరిగిన హత్య కేసును తెనాలి పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాలతోనే సోదరుడిని.. రాముమహేష్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెనాలి సీఐ అశోక్ కుమార్ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరపరిచినట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో చెడు వ్యసనాలకు బానిసై తరుచూ మద్యం సేవిస్తూ.. గొడవలు పడుతుండేవాడు. అతని పెద్దమ్మ కొడుకు తిరుమలశెట్టి నాగరాజు, ఇంటి పక్కన వారికి, పనిచేసే దగ్గర లేనిపోని మాటలు చెప్పి తనను తప్పుడు వ్యక్తిగా చిత్రీకరిస్తున్నాడని భావించాడు మహేష్. అందుకు పగ పెంచుకున్న రామ్ మహేష్ మద్యం సేవించి ఈనెల 14న కత్తితో విచక్షణరహితంగా పొడిచి హత్య చేశాడని సీఐ అశోక్ కుమార్ తెలిపారు. కేవలం నాగరాజు మాటలు విని తన భార్య తనను వదిలేసి వెళ్లిందని, మేస్త్రి కూడా పనిలో పెట్టుకోవడం లేదనే అక్కసు తోనే నాగరాజును హతమార్చినట్లు నిందితుడు రామ్ మహేష్ అంగీకరించినట్లు పోలీసులు వివరించారు.