అన్నదాతకు అభయం - chandramohan reddy
రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి 10 వేల చొప్పున ఆదాయం వచ్చేలా చర్యలకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. కేబినెట్ భేటీలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలను మంత్రి సోమిరెడ్డి వివరించారు.
అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి ఏడాదికి 10వేల రూపాయల చొప్పున అందేలా చూడాలని రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. కౌలు చేస్తున్న వారితో సహా రైతులందరికీ ఈ నిర్ణయాన్ని వర్తింపచేస్తామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. రైతులకు ఆర్థిక సహాయం చేసే పథకాన్ని కేంద్రం 5 ఎకరాలు ఉన్న వారికే వర్తింపజేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర సాయంతో పాటు రాష్ట్ర రైతులకు అదనంగా సహాయం చేసి సాగును మరింత వృద్ధిలోకి తీసుకువచ్చేలా ప్రోత్సహిస్తామని సోమిరెడ్డి చెప్పారు.