ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 14, 2022, 5:04 PM IST

ETV Bharat / state

రక్త నిల్వల కొరత తీర్చేందుకు యువత ముందుకు రావాలి: మంత్రి రజని

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్​క్రాస్ ఆధ్వర్యంలో అమరావతి ఎస్​ఆర్​ఎం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి విడదల రజని ప్రారంభించారు. దేశంలో రక్త నిల్వల కొరత తీర్చేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

రక్త నిల్వల కొరత తీర్చేందుకు యువత ముందుకు రావాలి
రక్త నిల్వల కొరత తీర్చేందుకు యువత ముందుకు రావాలి

దేశంలో రక్త నిల్వల కొరత తీర్చేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని పిలుపునిచ్చారు. అమరావతి ఎస్​ఆర్​ఎం విశ్వవిద్యాలయంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రెడ్​క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. రక్తదానం చేసిన విద్యార్థులకు మంత్రి ధ్రువపత్రాలు అందజేశారు.

ప్రపంచంలో రక్తానికి ప్రత్యామ్నాయం లేదని.. ఆ కొరత తీర్చాలంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. దేవుడిచ్చిన ప్రాణాన్ని నిలబెట్టాలంటే మరో వ్యక్తి రక్తం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలో రోజుకి ఐదు కోట్ల బ్లడ్ ప్యాకెట్లు అవసరమవుతుందని.. ప్రస్తుతానికి 2.5 కోట్లు బ్లడ్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి చెప్పారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details