గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రచారం ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం రాష్ట్రానికి చారిత్రక అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. వేరేపార్టీలోకి మారుతున్న వారంతా తెలుగుదేశం పార్టీలో టిక్కెట్లు లభించక, సామాజిక సమీకరణాలు కుదరక వెళ్తున్న వారేనని చెప్పారు. చంద్రబాబు సీటిస్తామన్నా పార్టీ నుంచి వెళ్లినవారు ఎవరూ లేరని మంత్రి పుల్లారావు స్పష్టం చేశారు.గడిచిన నాలుగున్నరేళ్లలో తెదేపా పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలను చూసిన ప్రజలు మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని...ప్రచారంలో ఆ స్పందన కన్పిస్తోందని ఆయన చెప్పారు.
'మళ్లీ తెదేపాకే పట్టం' - గుంటూరు జిల్లా
గడిచిన నాలుగున్నరేళ్లలో తెదేపా పాలన, అభివృద్ధి కార్యక్రమాలు చూసిన ప్రజలు మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
చిలకలూరిపేటలో మంత్రి పుల్లారావు ప్రచారం