ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛన్లు 10 రెట్లు పెంచిన ఘనత బాబుదే: ప్రత్తిపాటి - DWAKRA

దీపం పథకం కింద 30.61 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు... నాలుగేళ్లలో వడ్డీ రాయితీగా రూ. 2,514 కోట్లు ఇచ్చినట్లు మంత్రి ప్రత్తిపాటి పేర్కొన్నారు.

MINISTER PRATTIPATI PRAISE CM CHANDRABABU

By

Published : Feb 2, 2019, 12:57 PM IST

డ్వాక్రా మహిళలను చూస్తే తెదేపానే గుర్తుకొస్తుంది: ప్రత్తిపాటి
డ్వాక్రా మహిళలను చూస్తే తెలుగుదేశం పార్టీనే గుర్తుకొస్తుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పింఛన్లు, పసుపు - కుంకుమ - 2 చెక్కుల పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందాలనే పసుపు-కుంకుమ బహుమతి ఇస్తున్నామని తెలిపారు. పింఛన్లు 2014లో 5 రెట్లు, ఇప్పుడు 10 రెట్లు పెంచిన ఘనత చంద్రబాబుదని గుర్తుచేశారు. దీపం పథకం కింద 30.61 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు. నాలుగేళ్లలో వడ్డీ రాయితీగా రూ. 2,514 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి ఇంటికి అమృత్ పథకం కింద కుళాయిలు ఇస్తున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details