ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'దసరాకైనా తెలంగాణలోకి బస్సులు అనుమతిస్తారని ఆశిస్తున్నాం'

By

Published : Oct 16, 2020, 7:29 PM IST

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేశామని, ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్మించిన బస్​ షెల్టర్​ను ఎంపీ మోపిదేవి వెంకట రమణతో కలిసి ఆయన ప్రారంభించారు. బస్సులు తిప్పేందుకు తెలంగాణ రాష్ట్రంతో చర్చలు సాగుతున్నాయన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం దసరాకైనా బస్సులకు అనుమతి ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Minister perni nani
Minister perni nani

ఆర్టీసీ కార్మికులకు మంచి రోజులు రానున్నాయని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం ఐలాండ్ సెంటర్​లో నూతనంగా నిర్మించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బస్ షెల్టర్​ను రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు షేక్ ముస్తాఫా, కిలారి వెంకట రోశయ్యలతో కలిపి ప్రారంభించారు.

పొన్నూరు బస్ షెల్టర్ ప్రారంభోత్సవం

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి మాట్లాడుతూ సీఎం జగన్​ ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను పొరుగు రాష్ట్రాలు అవలంభించాలని ఆలోచిస్తున్నాయన్నారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చరిత్రాత్మకం అన్నారు. కార్పొరేషన్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేశామన్నారు. పొన్నూరు నుంచి రేపల్లె మీదుగా విశాఖపట్టణానికి, అదేవిధంగా పొన్నూరు నుంచి శ్రీశైలానికి మరో రెండు బస్సులను ఏర్పాటు చేసేందుకు అనుమతులను మంజూరు చేస్తామన్నారు.

వర్షం పడిన ప్రతిసారి బస్ స్టాండ్ ఆవరణ నీటిమయంగా మారుతోందని స్థానిక శాసనసభ్యుడు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే నిధులు మంజూరు చేసి నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పొన్నూరు నుంచి తిరుపతి రెండు లగ్జరీ బస్సులను ఆయన ప్రారంభించారు. అనంతరం పొన్నూరు ఆర్టీసీ డిపోలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కార్మిక సంఘాల నుంచి వచ్చిన వినతి పత్రాలను తీసుకున్న ఆయన సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ బస్సులను తెలంగాణలోకి రానివ్వడంలేదన్నారు. దసరా పండుగకైనా బస్సులకు అనుమతిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టుదలతో ప్రజలు నష్టపోకూడదన్నారు.

ఇదీ చదవండి :'రాష్ట్రంలో 61 ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్ర మంత్రి అంగీకారం'

ABOUT THE AUTHOR

...view details