Adimulapu Suresh knee surgery: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు మోకాలుకు హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్లో శస్త్రచికిత్స చేసారు. గత కొంతకాలంగా మంత్రి సురేష్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతం అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన వీల్‌ఛైర్‌పై వచ్చే చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి, దీంతో ఆయనకు ఏమైంది అనే చర్చ మెుదలైంది. చివరకు ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలుపడంతో మంత్రి సురేష్ అభిమానులు ఊపిరి పిల్చుకున్నారు.
యశోద హాస్పిటల్లో మంత్రి ఆదిమూలపు సురేష్‌కు శస్త్రచికిత్స
Minister Adimulapu Suresh: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మోకాలుకి హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్ లో శస్త్రచికిత్స చేసారు. ఆయన గత కొద్దికాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆదిమూలపు సురేష్