ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మోసానికి, న్యాయానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు' - చిలకలూరిపేట

చంద్రబాబు ముందుచూపు, దార్శినీయత చూసే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎంపీ రాయపాటితో కలిసి గుంటూరు జిల్లా రాజాపేట, బొప్పూడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మంత్రి ప్రత్తిపాటి ఎన్నికల ప్రచారం

By

Published : Mar 24, 2019, 6:31 AM IST

మంత్రి ప్రత్తిపాటి ఎన్నికల ప్రచారం
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం రాజాపేట, బొప్పూడి గ్రామాల్లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధిని చూసి సైకిల్ గుర్తుకు ఓటు వేయ్యండని కోరారు. తెదేపా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ముందుచూపు, దార్శినీయత చూసే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. 31 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్​కు ఓటు వేస్తే వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని విమర్శించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో జరగబోయే ఎన్నికలు మోసానికి, న్యాయానికి మధ్య పోటీగా అభివర్ణించారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు,ప్రత్తిపాటి సతీమణి వెంకట కుమారి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details