ప్రమాద వశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుంటూరులో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పది కుటుంబాలు స్థానికంగా ఉండే నాగండ్లవారిపాలెంలో రొయ్యల చెరువులకు కాపలాదారులుగా పనిచేస్తున్నారు. వీరిలో సర్వేశ్వరరావు అనే వ్యక్తి నిలిపి ఉన్న ట్రాక్టర్‌పై కూర్చుని ఉండగా ఆకస్మాత్తుగా ట్రాక్టర్ జారి పక్కనే ఉన్న బురద కాలువలో బోల్తా పడింది. వాహనం పైనున్న వ్యక్తిపై ట్రాక్టర్ పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆసుపత్రికి తరలించగా .. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
భార్యా, భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న వారి కుటుంబంలో ఊహించని ఉత్పాతం సంభవించింది. పొట్టకూటి కోసం వేరే జిల్లాకు వచ్చి కుటుంబాన్ని పోషించుకుంటున్న ఇంటి పెద్ద దిక్కు దురదృష్టవశాత్తు ట్రాక్టర్ కింద పడి తనువు చాలించాడు. తనను నమ్ముకున్న వాళ్లను అనాథలను చేసి వెళ్లిపోయాడు. ఊహించని ఈ హఠాత్పరిణామంతో మృతుని కుటుంబీకుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఈ హృదయ విదారక ఘటన గుంటూరులో చోటుచేసుకుంది.
గుంటూరులో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి