'పంచాయతీ' పరీక్షకని వెళ్తూ... తిరిగిరాని లోకాలకు! - యాక్సిడెంట్
పంచాయతీ కార్యదర్శి నియామక పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్తూ.. ఓ మహిళ కానరాని లోకాలకు వెళ్లింది. ప్రమాదంలో గాయపడిన ఆమె భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎదురెదురుగా వస్తున్న బైకులు ఢీకొన్న ప్రమాదంలో.. ఓ మహిళ మృతి చెందింది. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని అక్బర్ పేటకు చెందిన ఏరుబోయిన కుమార్... ఆయన భార్య హేమలత బైక్ పై వెళ్తున్నారు. ఈతేరు వద్ద ఎదురుగా వస్తున్న బైకును ఢీ కొట్టిన ప్రమాదంలో.. హేమలత అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆయనను బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు ఏసీ కళాశాలలో పంచాయతీరాజ్ కార్యదర్శి పరీక్ష రాసేందుకు కుమార్.. తన భార్యను తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.