వైకాపా ప్రభుత్వ తీరుపై నారా లోకేశ్ మండిపడ్డారు. గుంటూరు జైలులో ఉన్న 19 మంది రైతులను ఆయన పరామర్శించారు. రైతులంతా అమరావతి కోసం పోరాడుతూ రోడ్డు దిగ్బంధం కేసులో జైలుకెళ్లారు. వైకాపా వాళ్లు చేసే ర్యాలీకి పోలీసులు బందోబస్తు ఇస్తున్నారని.. ఐకాస నేతలపై కేసులు పెడుతున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, ఉద్యోగ విరమణ చేసిన ఆర్మీ జవాన్ ను అరెస్టు చేయడం సరికాదన్నారు. 16 నెలలు జైళ్లో ఉన్న జగన్ కు ఆంధ్రులందరినీ జైళ్లోకి పంపడం కల అని ఆరోపించారు.
'ఆంధ్రులందరినీ జైలుకు పంపడం జగన్ కల' - అమరావతి రైతుల అరెస్టు న్యూస్
రైతులను అడ్డుకుని ఉద్యమం అణిచివేయాలని ప్రభుత్వం చూస్తోందని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఐకాస నేతలపై ఇష్టం వచ్చినట్లు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఆంధ్రులందరినీ జైలుకు పంపడం జగన్ కల'