ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో మహిళ దారుణ హత్య - lady murder in yamarru

గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం యామర్రులో దారుణం జరిగింది. ఓ మహిళను దుండగులు మారణాయుధాలతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్​టీం, పోలీసు జాగిలాలతో ఆధారాల కోసం శోధించారు.

lady brutally murdered in yamarru
యామర్రులో మహిళ దారుణ హత్య

By

Published : Jan 28, 2020, 11:49 AM IST

మహిళ దారుణంగా హతమార్చిన దుండగులు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం యామర్రుల్లో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి చెరువు హెడ్ ట్యాంక్ వద్ద కేకలు వినిపించటంతో అక్కడకు పరుగులు తీసినట్లు స్థానికులు వివరించారు. అప్పటికే మహిళ రక్తపు మడుగులో పడి ఉందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మహిళను మారణాయుధాలతో దారుణంగా దాడి చేసి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు యనమదల రాధగా గుర్తించారు. రాధ భర్త 8 సంవత్సరాల క్రితమే మరణించారనీ, అప్పటి నుంచీ ఆమె ఒంటరిగానే ఉంటున్నట్లు పోలీసులు వివరించారు. నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details