కోడెల సంస్మరణ సభకు తెలుగుదేశం కుటుంబం - కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ
నరసారావుపేటలో దివంగత నేత ..మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తెలుగుదేశం కుంటుంబం కోడెలను స్మరించుకుంది.
kodela-shiva-prasad
దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును... తెలుగుదేశం కుటుంబం స్మరించుకుంది. గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు.... తెలుగుదేశం అధినేత చంద్రబాబుతోపాటు.. పార్టీ ముఖ్యనేతలు హాజరై... దివంగత నేతకు నివాళులు అర్పించారు. తెలుగుదేశానికి కోడెల చేసిన సేవలు, వ్యక్తిగతంగా తమతో ఉన్నఅనుబంధాన్నిగుర్తుచేసుకున్నారు. నరసరావుపేటలో కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.