గుంటూరు జిల్లాపరిషత్ ఛైర్పర్సన్ జానీమూన్.. తెదేపా నుంచి వైకాపాలో చేరారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గమైన గుంటూరు తూర్పు నుంచి ఆమె టికెట్ ఆశించారు. మహ్మద్ నసీర్‌కు తెదేపా టికెట్ ఖరారవడంపైఅసంతృప్తి చెెందారు.గుంటూరు జిల్లా వేమూరులో జరిగిన బహిరంగసభలో జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. వైకాపా అధినేత.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీకి, జెడ్పీ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేయకుండానే వైకాపాలోకి వెళ్లడం విమర్శలకు తావిస్తోంది.2014లో జరిగిన ఎన్నికల్లో ఆమె గుంటూరు జిల్లా కాకుమాను నుంచి జెడ్పీటిసీగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్రంలో ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనే కారణంతో తెలుగుదేశం పార్టీ ఆమెకు జెడ్పీ ఛైర్ పర్సన్ గా అప్పట్లోఅవకాశం కల్పించింది.