రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని గుంటూరు జిల్లా మంగళగిరిలో నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఓదార్చే హక్కు తమకు ఉందన్న నాగబాబు...రాజధాని రైతుల ఆందోళనకు జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. రాజధాని గ్రామాలకు వెళ్లకూడదని పోలీసులు ఆంక్షలు విధించారని వాపోయారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు లాఠీఛార్జి చేశారని... ఎర్రబాలెం వరకైనా వెళ్లేందుకు అనుమతివ్వట్లేదని తెలిపారు. ఎంత సమయమైనా ఆయా గ్రామాల్లో పర్యటించి రైతులను పరామర్శిస్తామని పేర్కొన్నారు.
రాజధాని రైతుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు: నాగబాబు - janasena leader nagababu supports to amaravathi farmers
రాజధాని రైతుల ఆందోళనకు జనసేన సంపూర్ణ మద్దతిస్తుందని నాగబాబు తెలిపారు. మహిళల అని చూడకుండా వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడం తగదని హితవు పలికారు. రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులను తప్పకుండా ఓదార్చుతామన్నారు.
రాజధాని రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తామన్న జనసేన నేత నాగబాబు