విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయకుండా... తమవంతు కృషి చేస్తామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన... ప్రైవేటీకరణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలుస్తారని తెలిపారు.
'విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం' - విశాఖ ఉక్కు పరిశ్రమ నేటి వార్తలు
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ అంశంపై త్వరలోనే ప్రధానిని, కేంద్ర మంత్రులను కలుస్తామని అన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమపై నాదెండ్ల మనోహర్ స్పందన
లక్షమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ప్లాంటును ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో పెట్టడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారని, లక్షల మంది ఆందోళనలు చేశారని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. యూపీఏ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణలో ఉక్కు కర్మాగారాన్ని చేర్చారని ప్రస్తావించారు.
ఇదీచదవండి.