ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇది జగన్​కు... జనానికి మధ్య జరుగుతున్న యుద్ధం:ఐకాస

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు తమ పోరాటం ఆగదని ఐకాస తెలిపింది. అరెస్టులతో తమ ఉద్యమాన్ని అణచలేరని స్పష్టం చేసింది. ఇది కులాలు, పొలాల పోరాటం కాదని అన్నారు.

jac-leaders-fires-on-ycp-government
jac-leaders-fires-on-ycp-government

By

Published : Jan 8, 2020, 11:14 PM IST

Updated : Jan 9, 2020, 12:00 AM IST

విజయవాడ బెంజ్ సర్కిల్​లో చంద్రబాబు సహా పలువురు నేతల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును 'అమరావతి పరిరక్షణ సమితి(ఐకాస)' ఖండించింది. అమరావతిలోని చంద్రబాబు నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన ఐకాస నేతలు... వైకాపా ప్రభుత్వం​పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారి పట్ల పోలీసుల చర్యలు సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.రేపటి ఐకాస సమావేశాలు జరుగుతాయని తెలిపారు.కాకినాడ,మచిలీపట్నం,ఒంగోలు ఐకాస సమావేశాల్లో పాల్గొంటామని వెల్లడించారు.ప్రభుత్వ తీరును ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు.ఇది కులాల-పొలాల పోరాటం కాదని అన్నారు. త్వరలోరాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామని తెలిపారు. ఏపీలో చీకటి రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఇది 29 గ్రామాల కోసం జరుగుతున్న ఆందోళన కాదని... జగన్​కు, జనానికి మధ్య జరుగుతున్న యుద్ధమని వారు వ్యాఖ్యానించారు. అరెస్టులతో ఏ ఉద్యమాన్ని అణచలేరని వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతే ఉంటుందని చెప్పే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

మీడియా సమావేశంలో ఐకాస నేతలు
Last Updated : Jan 9, 2020, 12:00 AM IST

ABOUT THE AUTHOR

...view details