మోదుగుల ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు - it raids
గుంటూరు నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోదుగుల వేణుగోపాలరెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఆదాయపుపన్ను శాఖ దాడులు చేసింది.
వైకాపా ఎంపీ అభ్యర్థి కార్యాలయాలపై ఐటీ దాడులు
ఎన్నికల వేళ ప్రముఖ రాజకీయ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. గుంటూరు నగరంలోని పట్టాభిపురంలో వేణుగోపాలరెడ్డి ఇల్లు, బృందావన్ గార్డెన్స్‌లోని కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేశారు. వేణుగోపాల్‌రెడ్డి బంధువులు, న్యాయ సలహాదారు కార్యాలయాల్లోనూ ఏకకాలంలో దాడులు చేశారు. మోదుగుల బ్యాంకు అకౌంట్లకు సంబంధించి నిధులేమైనా బయటకు వెళ్లాయా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.