ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పక్షవాతం బారిన పడినా.. కోలుకునే అవకాశం ఉంది'

ప్రస్తుతం ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినందున.. పక్షవాతం బారిన పడినా కోలుకునే అవకాశం ఉందని ఇండియన్ స్ట్రోక్ అసోషియేషన్ కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ పమిడి ముక్కల విజయ తెలిపారు. పక్షవాతం లేని సమాజాన్ని తయారు చేయటమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

Indian Stroke Association member on paralysis
పక్షవాతం బారిన పడినా..కోలుకునే అవకాశం ఉంది

By

Published : Apr 5, 2021, 8:41 PM IST

పక్షవాతం లేని సమాజాన్ని తయారు చేయటమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు ఇండియన్ స్ట్రోక్ అసోషియేషన్ కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ పమిడి ముక్కల విజయ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన కార్యవర్గ సభ్యుల ఎన్నికల్లో గుంటూరుకు చెందిన ఆమె ఎన్నికయ్యారు. మూడు సంవత్సరాల పాటు డాక్టర్ విజయ ఈ పదవిలో కొనసాగనున్నారు.

దేశవ్యాప్తంగా 800 మందికి పైగా నాడీసంబంధ వ్యాధి నిపుణులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారన్నారని ఆమె తెలిపారు. పక్షవాతంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించటం ద్వారా వ్యాధి బారిన పడకుండా తమ సంఘం పని చేయనుందని వెల్లడించారు. మండల స్థాయి వైద్యుల్లోనూ పక్షవాతానికి సంబంధించిన అత్యవసర చికిత్సలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రస్తుతం ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినందున పక్షవాతం బారిన పడినా... కోలుకునే అవకాశం ఉందని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details