ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెరుగుతున్న కరోనా కేసులు...అధికారుల ముమ్మర చర్యలు

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి నిర్ధరణ పరీక్షలు ముమ్మరం చేశారు. గుంటూరు వైద్య కళాశాల ప్రాంగణంలోని ప్రయోగశాలకు అదనంగా నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పెరుగుతున్న కరోనా కేసులు
పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Apr 17, 2020, 11:21 AM IST

కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లాలో అధికారులు వ్యాధి నిర్ధరణ పరీక్షలు ముమ్మరం చేశారు. జిల్లాలో 122 పాజిటివ్ కేసులు నమోదు కాగా...చాలామంది అనుమానితులున్నారు. ఈ తరుణంలో గుంటూరు వైద్య కళాశాల ప్రాంగణంలోని ప్రయోగశాలకు అదనంగా నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నరసరావుపేట, మాచర్ల, తెనాలి, గుంటూరులో ఏర్పాటు చేసిన కొత్త ల్యాబ్‌ల ద్వారా రోజుకు 400 మంది నమూనాలు పరిశీలించవచ్చని అధికారులు తెలిపారు. గురువారం ఒక్కరోజే 500 మందికి సంబంధించిన నమూనాలు తీసి.. ప్రయోగశాలకు పంపించారు. ప్రయోగశాలల సంఖ్య పెరగటంతో త్వరగా నివేదికలు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

పాజిటివ్ కేసులు, అనుమానితులు గుంటూరులోని ఐడి ఆసుపత్రి, కాటూరి వైద్య కళాశాల, ఎన్​ఆర్​ఐ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి బంధువులు, సంబంధం ఉన్నవారిని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. సుమారు 16వందల మందికి పైగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 89 పాజిటివ్ కేసులు గుంటూరు నగరం పరిధిలో ఉండటంతో లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల తర్వాత రోడ్లపైకి ఎవరినీ రానీయటం లేదు. రెడ్ జోన్లలో సరుకులు, కూరగాయలు అందటం లేదన్న ఫిర్యాదులతో నగరపాలక సంస్థ అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details