గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో 'మన రాజధాని అమరావతి' అనే నినాదంతో ర్యాలీ చేశారు. నిరసన దీక్షలో భాగంగా... ప్రభుత్వ నివేదికలను భోగి మంటల్లో వేసి కాల్చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, తెదేపా నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. అందరికి మంచి జరగాలని సంక్రాంతి పండుగను... చాలా బాధగా జరుపుకుంటుమన్నారు. మంటల్లో కమిటీల నివేదికల ప్రతులు తగలబెట్టిన వాళ్లు... ప్రభుత్వానికి కనువిప్పు కలిగి అంతా మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు.
భోగి మంటల్లో... ప్రభుత్వ నివేదికలు దగ్దం - amaravathi news in ap
అమరాతి రాజధానికి వ్యతిరేకంగా ఇచ్చిన ప్రభుత్వ నివేదికలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు జేేఏసీ నేతలు. 16రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన చేశారు.

భోగి మంటల్లో... ప్రభుత్వ నివేదికలు దగ్దం
భోగి మంటల్లో... ప్రభుత్వ నివేదికలు దగ్దం