బాపట్ల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పోలీసుశాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఈటీవీ భారత్ తో డీఎస్పీ ముఖముఖి మాట్లాడారు. ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని సమర్థులైన అభ్యర్థులను సర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలన్నారు.
సమస్యాత్మక గ్రామాలు, అసాంఘిక శక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించి... నిఘా పెట్టినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణ, శాంతిభద్రతలకు భంగం కలిగించేవారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని తెలిపారు. పది మండలాల పరిధిలోని 104 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పిన ఆయన....1986 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశామన్నారు. 80 అతి సమస్యాత్మక, 55 సమస్యాత్మక గ్రామాలు ఇప్పటికే గుర్తించామని చెప్పారు.