ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: హోం మంత్రి సుచరిత

By

Published : Jul 13, 2021, 8:47 PM IST

గుంటూరు జిల్లా బోయపాలెంలోని క్వారీలో రెండు రోజుల క్రితం మృతి చెందిన నలుగురు యువకుల కుటుంబాలను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

home minister sucharitha
హోంమంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు జిల్లా బోయపాలెంలోని క్వారీలో రెండు రోజుల క్రితం మృతి చెందిన నలుగురు యువకుల కుటుంబాలను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. ప్రత్తిపాడులోని బాధిత కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు. 2003లో తీసిన క్వారీలో గుంతలో నలుగురు యువకులు ప్రమాదవశాత్తు పడి మృతి చెందడం బాధాకరమన్నారు. క్వారీల వద్ద హెచ్చరిక బోర్డులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

మైనింగ్ శాఖ అధికారులు అనుమతులు ఇచ్చేటప్పుడు తగు నిబంధనలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్వారీల వద్ద చుట్టూ కంచెతో పాటు.. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేలా కలెక్టర్లతో చర్చిస్తామని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి.. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details