ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 15, 2020, 12:13 PM IST

ETV Bharat / state

బెల్లంకొండ మేజర్ కాల్వకు గండి.. 100 ఎకరాల వరిపంట మునక

మేజర్ కాల్వకు గండిపడి 100 ఎకరాల వరిపంట నీటమునిగిన ఘటన గుంటూరు జిల్లా అనుపాలెం వద్ద జరిగింది. కష్టపడి పండించిన పంట చేతికందే సమయానికి నీటి పాలైందని రైతులు వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

crop drowning
నీటమునిగిన వరిపంట

వరి చేలో ప్రవహిస్తున్న కాల్వ నీరు

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద ఉన్న బెల్లంకొండ మేజర్ కాల్వకు గండిపడింది. దీంతో అంచులవారిపాలెంకు చెందిన సుమారు 100 ఎకరాల వరిపంట నీటమునిగింది.

దీనిపై బాధిత రైతులు మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ పంట మునిగిందని ఆరోపించారు. ఆరుగాలం పండించిన పంట చేతికందే సమయానికి నాశనమైందని వాపోయారు. బీటలు పడిన కాల్వకు మరమ్మతులు చేయాల్సిందిగా తాము ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదన్నారు. అనంతరం అధికారులు గండి పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేశారు.

మేజర్ కాల్వకు గండి

పంట నష్టాన్ని అంచనా వేస్తాం

దీనిపై ఎన్​ఎస్పీ ఏఈ భాస్కర్ బాబు స్పందిస్తూ.. కాల్వకు మరమ్మతుల గురించి గతంలోనే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామన్నారు. అయితే ఈలోపలే అనుకోకుండా గండి పడిందని తెలిపారు. కాల్వకు చెందిన స్థలంలో కొందరు రైతులు అక్రమంగా పంటలు వేశారన్నారు. పంట నష్టాన్ని అంచనా వేస్తామని చెప్పారు.

ఇవీ చదవండి..

పిఠాపురంలో అగ్నిప్రమాదం.. ఆహుతైన 1200 కోళ్లు

ABOUT THE AUTHOR

...view details