HC Funds of Panchayats: పంచాయితీ నిధులను ప్రభుత్వం మళ్లించిందంటూ రాష్ట్ర పంచాయితీ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు. పంచాయితీలకు వచ్చిన నిధులను ప్రభుత్వం డ్రా చేసుకోవడంతో గ్రామాభివృద్ది కుంటుపడుతుందని పేర్కొన్నారు. పంచాయితీల్లో నిధుల కొరతతో అసలు పనులు జరగడం లేదన్నారు.
తమ నిధులను వాడేసుకున్న ప్రభుత్వం వెంటనే వాటిని పంచాయితీ అకౌంట్లకు బదిలీ చేయాలని పిటిషనర్ కోరారు. నిధులను ఒక అకౌంట్లో నుంచి మరో అకౌంట్కు ఎలా బదిలీ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఒక్కోసారి ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్కు బదిలీ చేసినా, తరువాత మళ్లీ నిధులను ఒరిజినల్ అకౌంట్కు తీసుకురావాలి కదా అని ప్రశ్నించింది.