Hello Lokesh Program with Students And Youth :టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని డాన్ బాస్కో పాఠశాలలో "హలో లోకేశ్(Hello Lokesh)" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువతతో ముఖాముఖి నిర్వహించారు. అలాగే వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. యువత బంగారు భవిష్యత్తుకు తాను భరోసా కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Nara Lokesh Face to Face with Students and Youth :దేశమంతా గొప్పగా చెప్పుకునే ఏపీ.. ఇప్పుడందరికీ చులకనైందన్నారు. నారా చంద్రబాబు సీఎంగా ఉండగా రాష్ట్రానికి అనేక కంపెనీలు వచ్చాయని, వైసీపీ ప్రభుత్వం ఫాక్స్‌కాన్ వంటి కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానులు కావాలా?.. అమరావతి రాజధాని కావాలా?.. చిన్న జీతంతో సరిపెట్టుకుంటారా?.. రూ.50 వేల జీతం తీసుకుంటారా? అని విద్యార్థులను, యువతను ప్రశ్నించారు. ఎలాంటి భవిష్యత్తు కావాలో యువతే నిర్ణయించుకోవాలని లోకేశ్ అన్నారు.
ఏటా జాబ్ క్యాలెండర్ :నాలుగేళ్లుగా ఒక్క నోటిఫికేషన్ రాలేదని విద్యార్థులు అడిగిన ప్రశ్నకు లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఉద్యోగాల కోసం యువత ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని, ఇంకో 9 నెలలు ఓపిక పట్టండి.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళిక అమలు చేశామని అన్నారు. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామని.. ఏటా జాబ్ క్యాలెండర్(Every Year Job Calendar) ఇస్తామని హామీ ఇచ్చారు. కేజీ నుంచి పీజీ వరకూ విద్యా ప్రణాళికలో మార్పులు తీసుకువస్తామని తెలిపారు. సామాజిక బాధ్యత, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. జాబ్ రెడీ యూత్‌ని తయారు చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని అన్నారు. ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తామని చంద్రబాబు ప్రకటించారని లోకేశ్ గుర్తు చేశారు.
AP JOB Calendar: ప్రతిపక్షంలో జాబ్ క్యాలెండరంటూ.. అధికారంలో ఉద్యోగాల భర్తీ ఊసేలేదు
పక్క రాష్ట్రాల వారు మన రాష్ట్రానికి ఉపాధి కోసం వస్తారు :అమర రాజా కంపెనీని తెలంగాణకు పంపించేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంకుర సంస్థలను ప్రోత్సహిస్తామని, ఉపాధి కోసం ఎవరూ పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా చూస్తామన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్నవారు కూడా ఇక్కడికి వచ్చేలా చేస్తామని తెలిపారు. అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలనేదే టీడీపీ టార్గెట్ తెలిపారు. ప్రజా సమస్యలపై యువత కూడా పోరాటం చేయాలని నారా లోకేశ్ సూచించారు.
పాత విధానంలోనే ఫీజురియంబర్స్మెంట్ అమలు చేస్తాం :తాము అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్‌మెంట్‌ను కొనసాగిస్తామని తెలిపారు. వసతి దీవెన, విద్యా దీవెన పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. వసతి దీవెన, విద్యా దీవెన వల్ల 2 లక్షల మందికి మార్క్‌లిస్ట్ రాలేదని.. టీడీపీ అధికారం చేపట్టాక కళాశాలలకే నేరుగా ఫీజులు చెల్లిస్తామని భరోసా కల్పించారు.