పులిచింతల ప్రాజెక్టు నుండి మరో 7 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో, రేపల్లె మండలంలోని పల్లిపాలెం గ్రామం చుట్టూత వరద నీరు చేరుంది. దీంతో గ్రామంలోని లోతట్టు ఇళ్లు మునిగిపోయాయి. అప్రమత్తమైన అధికారులు, స్థానికులను పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీరు క్రమంగా పెరుగుతుండడంతో తీరప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. వరద ముంపు గ్రామాలలో అన్నీ సహాయ చర్యలు చేపట్టినట్లు మండల తహసీల్దార్ విజయశ్రీ తెలిపారు.
రేపల్లెను తాకిన ప్రకాశం బ్యారేజి వరద నీరు
ప్రకాశం బ్యారేజి నుండి అన్ని గేట్లు ఎత్తివేయడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పోటెత్తుతోంది. వరద నీరు రేపల్లె మండలం పల్లిపాలెం గ్రామాన్ని చుట్టుముట్టింది. దీంతో అధికార్లు పునరావాసా చర్యలకు దిగారు.
పునరావాస ప్రాంతాలకు వెళుతున్న ప్రజలు