ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో భారీ వర్షం...వాహనదారుల ఇబ్బందులు

గుంటూరులో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

ట్రాఫిక్ జాం

By

Published : Sep 21, 2019, 9:10 PM IST

Updated : Sep 21, 2019, 11:52 PM IST

గుంటూరులో భారీ వర్షం...వాహనదారుల ఇబ్బందులు

గుంటూరులో భారీ వర్షం కురిసింది. నగరాన్ని వరణుడు వదిలిపెట్టటంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, పాదచారులు అవస్థలు వర్ణణాతీతం. అమరావతి రోడ్డు, నందివెలుగు రోడ్డు, నల్లచెరువు, చట్టూగుంట, పాత గుంటూరులో మోకాలు లోతు నీళ్లు పారుతున్నాయి.మార్కెట్ సెంటర్, శంకర్ విలాస్ ఫ్లై ఓవర్, కంకరగుంట బ్రిడ్జ్, చుట్టూగుంట, లాడ్జ్ సెంటర్, బస్టాండ్ కూడలి వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. గంటలకొద్ది నిలిచిన ట్రాఫిక్​తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ దూరం వెళ్లేందుకు గంట సమయం పట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు.

Last Updated : Sep 21, 2019, 11:52 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details