ఐదు లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని వైద్యారోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని శాసనమండలిలో ప్రకటించారు. ఆరోగ్యశ్రీ అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సజాతరావు కమిటీ నివేదిక ఆధారంగా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. పథకం నిబంధనలు సరళతరం చేసి ఎక్కువమందికి లబ్ధి చేకూరేలా చేస్తామన్నారు. వైద్య ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వచ్చేలా నిబంధనలు తెస్తున్నట్లు వివరించారు.
'ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ' - arogya sri
ఐదు లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామనీ.. వైద్య ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే పథకం పరిధిలోకి వచ్చేలా నిబంధనలు తెస్తామని మంత్రి ఆళ్ల నాని శాసనమండలిలో ప్రకటించారు.
'ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీ'