గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి 36వ తిరునాళ్ల మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. మొదటగా స్వామివారికి 108 లీటర్ల ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తెల్ల ఆవాలు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలతో ఘనంగా అభిషేకం చేశారు. అనంతరం హనుమాత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామస్వామి శాంతి కల్యాణం కనుల పండువగా జరిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కోటేశ్వరరావు, ఇఓ సాయిబాబు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు.
ఘనంగా బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు - boppidi
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి 36వ తిరునాళ్ల మహోత్సవం చేశారు. మొదట స్వామివారికి అభిషేకం చేసి తదుపరి హనుమాన్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామస్వామి కల్యాణం జరిపారు
ఘనంగా బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి 36వ తిరునాళ్లు