గుంటూరు జిల్లా మేడికొండూరులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై మేడికొండూరు వచ్చారు. ఓ దుకాణంలో సరకులు కొనుగోలు చేసి.. 200 రూపాయల నోటు ఇచ్చారు. కొద్దిసేపటి తర్వాత దుకాణం యజమాని నోటును పరీక్షించి నకిలీదిగా గుర్తించారు. మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ముఠాలోని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం గుంటూరుకు తరలించారు.
FAKE CURRENCY: గుంటూరులో నకిలీ నోట్ల కలకలం.. ఇద్దరి అరెస్ట్
two people arrest in fake currency case: గుంటూరు జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే ముఠాకు సంబంధించిన మరో నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన మొత్తం ఆరుగురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరు గుంటూరుకు చెందినవారని.. ఇక్కడే వారందరూ కలిసి నెలరోజులుగా కలర్ జిరాక్స్ సాయంతో రూ. 100, 200, 500 నోట్లను ముద్రిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇలా తయారు చేసిన నోట్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్పిడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మొత్తం లక్షల్లోనే నోట్లను మార్పిడి చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కగా.. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి:
fire accidnet in visakha steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. రెండు లారీలు దగ్ధం