ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆందోళన వద్దు.. వైద్యుల సలహాలతో కరోనాను జయించవచ్చు'

కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ శామ్యూల్​ ఆనంద్​ సూచించారు. కరోనా వచ్చినా ఆందోళన చెందకుండా.. వైద్యుల సలహాలతో నయం చేసుకోవచ్చని అన్నారు. వైద్యుల సూచనలతోనే తాను, తన కుటుంబం కరోనాను జయించామని చెప్పారు.

'ఆందోళన వద్దు.. వైద్యుల సలహాలతో కరోనాను జయించవచ్చు'
'ఆందోళన వద్దు.. వైద్యుల సలహాలతో కరోనాను జయించవచ్చు'

By

Published : Aug 1, 2020, 8:16 PM IST

కరోనా వైరస్‌ సోకిందని ఆందోళన చెందకుండా.. వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తే కరోనాను జయించవచ్చని జిల్లా పాలనాధికారి శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ అన్నారు. తనతో పాటు భార్య, కుమారుడికి కరోనా వచ్చిందని.. హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సలహాలు పాటించి.. తిరిగి ఆరోగ్యవంతంగా విధులకు హాజరయ్యానన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుటుంబం మొత్తం కరోనాను ఎదుర్కొన్నామని అన్నారు.

ఎక్కువ శాతం ఎలాంటి లక్షణాలు లేకుండా వైరస్‌ బారిన పడుతున్నారని వారు ఇంటి వద్దనే ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తే సరిపోతుందని కలెక్టర్​ తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండే వారి కోసం ఓ కిట్‌ను రూపొందించామని.. బాధితులకు కిట్​ అందించడం సహా అత్యవసరమైన సందర్భాల్లో ఎవరిని సంప్రదించాలో తెలిపే ఫోన్​ నెంబర్లతో కూడిన కరపత్రం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా వైరస్​ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details