ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 16, 2019, 9:14 PM IST

ETV Bharat / state

తల్లిదండ్రులకు తెలుస్తుందేమోనని... ఓ బాలిక ఇలా చేసింది

పాఠశాలలో తోటి స్నేహితులతో జరిగిన గొడవ గురించి... తల్లిదండ్రులకు తెలుస్తుందేమోనని ఓ బాలిక ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా దుర్గిలో జరిగింది.

ఆసుపత్రిలో బాలికతో మాట్లాడుతున్న కుటుంబీకులు

తల్లిదండ్రులకు తెలుస్తుందేమోనని... ఓ బాలిక ఇలా చేసింది

గుంటూరు జిల్లా దుర్గి కస్తూర్భాగాంధీ విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదవుతున్న ఓ బాలిక... భవనంపై నుంచి దూకింది. దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామానికి చెందిన సుజాత... తోటి విద్యార్థునులతో గొడవ పడింది. ఈ విషయం ఉపాధ్యాయుల దృష్టికి వెళ్లింది. అయితే... ఈ గొడవ తల్లిదండ్రుల దృష్టికి వెళ్తుందనే భయంతో... సుజాత భవనంపై నుంచి దూకినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details